చాలు.. ఇక నేను ఇక్కడ ఉండలేను: దర్శకుడు

చాలు.. ఇక నేను ఇక్కడ ఉండలేను: దర్శకుడు
X

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత హిందీ ఇండస్ట్రీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉన్నాయి.. నెపోటిజమ్ గురించి, డైరెక్టర్ల గురించి పలు రకాలుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అడిగినవన్నీ తీరిస్తేనే అవకాశాలు అన్నీ కొందరు నటీమణులు బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే 'క్విట్ బాలీవుడ్' తెరపైకి వచ్చింది. థప్పడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా.. చాలు.. నేనిక ఇక్కడ ఉండలేను.. బాలీవుడ్ నుంచి రాజీనామా చేస్తున్నా.. అని ట్వీట్ చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు.

ఆయనతో పాటు మరికొందరు సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా కూడా బాలీవుడ్ చోడో అంటూ ట్వీట్ చేశారు. తాము ఇండస్ట్రీలోకి ప్రసిద్ధ దర్శకులను చూసి వచ్చామని వారు రాజ్ కపూర్, గురు దత్, రిత్విక్ ఘటక్, బిమల్ రాయ్, మృణాల్ సేన్, హృషికేశ్ ముఖర్జీ, కె ఆసిఫ్, విజయ్ ఆనంద్, జావేద్ అక్తర్, తపన్ సిన్హా, గుల్జార్, శేఖర్ కపూర్, కేతన్ మెహతా, అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ పేర్లను తమ ట్వీట్ లో జత చేశారు. వీరంతా కేవలం భారతీయ సినిమాలు తీశారని ప్రశంసించారు.

Tags

Next Story