చేసుకుంటే నన్నే చేసుకో.. లేదంటే చావు..

చేసుకుంటే నన్నే చేసుకో.. లేదంటే చావు..

ఆకర్షణ ప్రేమగా మారింది.. అతగాడిని పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ అతడు పెళ్లి మాట ఎత్తేసరికి తప్పించుకుతిరుగుతున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె రాసిన సూసైడ్ నోట్ కుటుంబసభ్యుల కంట పడింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి, సత్తయ్యలకు నలుగురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలకు వివాహం కాగా నాలుగో కుమార్తె ఉమ ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన రంజిత్, ఉమ ఇంటర్ నుంచి ప్రేమికులుగా ఉన్నారు. అతడినే పెళ్లి చేసుకుంటానని ఉమ చెప్పడంతో తల్లిదండ్రులు వెళ్లి రంజిత్ కుటుంబసభ్యులను కలిశారు.

కానీ రంజిత్ ఉమను పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు కాదంటూ దాటవేస్తున్నాడు. దాంతో ఉమకి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నా వాటినీ చెడగొడుతున్నాడు రంజిత్. చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేదంటే చచ్చిపో అంటూ ఉమను బెదిరిస్తున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఉమ ఈనెల 20 రాత్రి పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు గమనించి జగిత్యాలకు , అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వైద్యం అందిస్తుండగానే బుధవారం ఉమ ప్రాణాలు కోల్పోయింది.

ఇంట్లో ఉమ రాసిన సూసైడ్ నోట్ కనిపించింది ఆమె అక్కలకు. నన్ను క్షమించండి. నేను ప్రేమించిన రంజిత్ నన్ను సంతోషంగా ఉండనివ్వడం లేదు. ప్రేమించావు కదా చేసుకుంటే నన్నే చేసుకో లేదంటే చచ్చిపో అని అంటున్నాడు. వాడిని పెళ్లి చేసుకున్నా నేను సంతోషంగా ఉండలేను. చేసుకుంటే మీకు చెడ్డపేరు వస్తుంది. బ్రతికి ఉండి బాధ పడడం కన్నా చావే నయం. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లి పోతున్నా.. మిస్ యూ మమ్మీ డాడీ అని ఉమ లేఖలో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story