ఇకనుంచి మాస్కు ధరించకపోయినా.. ఉమ్మివేసినా లక్ష జరిమానా..

ఇకనుంచి అక్కడ బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోయినా.. ఉమ్మివేసినా జరిమానా మోత మోగుతుంది. వంద కాదు వెయ్యి కాదు ఏకంగా లక్ష సమర్పించుకోవలసిందే. గురువారం జార్ఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి లాక్‌డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘింస్తే.. రూ. లక్ష రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్షను ప్రకటించింది. ఈ మేరకు జార్ఖండ్ కేబినెట్ బుధవారం అంటు వ్యాధుల ఆర్డినెన్స్ (ఐడిఓ) 2020 ను జారీ చేసింది.
ఇకపై సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన వారు, మాస్కులు ధరించని వారు రూ .1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఐడిఓ 2020 లో జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. జార్ఖండ్‌లో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com