నిధుల సమీకరణకు యూకో బ్యాంక్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌

నిధుల సమీకరణకు యూకో బ్యాంక్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌
X

రూ.3వేల కోట్ల నిధుల సమీకరణకు యూకో బ్యాంక్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇవాళ సమావేశమైన యూకో బ్యాంక్‌ బోర్డు... ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ నిధులను సమీకరించడానికి సమ్మతించింది. ఎఫ్‌పీఓ, క్యూఐపీ, ప్రిఫరెన్షియల్‌ ఇష్యూతో పాటు ఇతర పద్ధతుల్లో ఈ నిధులను యూకో బ్యాంక్‌ సమీకరించనుంది.

ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ, సెబీ అనుమతులు తప్పనిసరి అని, ఆ అనుమతులను త్వరలోనే పొందుతామని యూకో బ్యాంక్‌ వెల్లడించింది. ఇక నిధుల సమీకరణ వార్తలతో ఇవాళ ఇంట్రాడేలో యూకో బ్యాంక్‌ 2శాతం లాభపడి డే గరిష్ట స్థాయి రూ.14.43కు చేరింది. ప్రస్తుతం అరశాతం లాభంతో రూ.14.22 వద్ద షేర్‌ ట్రేడవుతోంది.

Tags

Next Story