పాజిటివ్ వచ్చిందని సొంతింట్లోకి కూడా..

పాజిటివ్ వచ్చిందని సొంతింట్లోకి కూడా..
X

మహమ్మారి కరోనా ఓ మాయని మచ్చగా మిగిలిపోనుంది. పాజిటివ్ అని తెలిస్తే ఒంటరిగా ఓ మూల కూర్చోవాలి. అయిన వాళ్లు కూడా దగ్గరకు రావడానికి భయపడతారు. మరణించినా నీ చావు నువ్వే చావంటూ వదిలేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన ఓ ఏఎన్ఎం భర్తకు పాజిటివ్ అని తెలియడంతో అతడిని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఏఎన్ఎం కారణంగా ఎక్కడ తమకు కూడా కరోనా సోకుంతుందో అనే భయంతో గ్రామస్తులు ఆమెని ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు.

ఇన్నాళ్లు గ్రామానికి ఏఎన్ఎంగా సేవలందించినందుకుగాను ఇదేనా ఫలితం అని ఆమె వాపోతోంది. ఆమె తన సొంత ఇంట్లోకి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. ఇంకెక్కడికి వెళ్లమంటారు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామ పొలిమేరల్లోనే గ్రామస్తులు ఆమెని అడ్డుకుని ఊళ్లోకి రావడానికి వీల్లేదని అన్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందడంతో పోలీసులు వచ్చి గ్రామస్తులకు సర్ధి చెప్పాల్సి వచ్చింది.

Tags

Next Story