కోలుకుని డిశ్చార్జ్ అయిన రెండు గంటల్లో..

కోలుకుని డిశ్చార్జ్ అయిన రెండు గంటల్లో..
X

కరోనాని అస్సలు నమ్మడానికి లేదన్నట్లు ఉంది పరిస్థితి. తాజాగా జమ్మూకశ్మీర్ లోని ఓ కూల్ డ్రింక్ ప్లాంట్ లో పని చేసే 12 మందికి కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జ్ అయ్యే ముందు మళ్లీ టెస్ట్ కి ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ మొదటి సారి నెగిటివ్ రావడంతో వారిని ఇళ్లకు పంపిచారు. మళ్లీ రెండో సారి అవే శాంపిల్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ చూపించింది. దీంతో వారి బంధువులతో పాటు, చుట్టుపక్కల వారూ ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి కరోనా ఉందో లేదో అర్థం కాని పరిస్థితి. అయినా హోం క్వారంటైన్ లో ఉండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారు.

Tags

Next Story