కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ
X

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో ఎంపీ రఘురామకృష్ణం రాజు భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. పార్లమెంటు సమావేశాల నిర్వహణ, స్టాండింగ్ కమిటీ సమావేశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఏపీ రాజకీయాంశాలపై కూడా ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. గతకొన్ని రోజులుగా ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు రఘురామకృష్ణం రాజు. త్వరలో మరికొందరు సీనియర్ నేతలతో కూడా భేటీ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది రఘురామకృష్ణంరాజు.

Tags

Next Story