అంతర్జాతీయం

బ్రెజిల్ లో కరోనా కల్లోలం.. 24 గంటల్లో..

బ్రెజిల్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో, బ్రెజిల్‌లో 59 వేల 961 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో సోకిన వారి సంఖ్య ఇప్పుడు 22 లక్షల 87 వేల 475 కు చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 84 వేల 82 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ అంటువ్యాధి నుండి సుమారు 15 లక్షల 70 వేల మంది కోలుకున్నారు. అమెరికా తరువాత మహమ్మారి బారిన పడిన దేశం బ్రెజిల్. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు వరుసగా మూడోసారి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం బోల్సోనారో ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఆయనకు మూడోసారి పరీక్ష నిర్వహించినట్టు అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది.

Next Story

RELATED STORIES