దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు వాయిదా

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు వాయిదా
X

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో జరగాల్సిన ఉపఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మళ్ళీ పరిస్థితులు అనుకూలమైన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగా ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం, శాసనసభ పదవీకాలం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం మిగిలి ఉంటే, ఆ ఖాళీ అయిన రోజునుంచి ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

Tags

Next Story