ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు హతం

ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు హతం
X

ఒడిశాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మద్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లా సకేళి అడవిలో గురువారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. సాయంత్రం సమయంలో పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story