ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే ఆర్కేకు షాక్..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్రమ కట్టడమంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. టీడీపీ ఆఫీసును ఆత్మకూరు వద్ద వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లారు. టీడీపీకి భూకేటాయింపు చేస్తూ జారీచేసిన జీవో 228 ను రద్దు చెయ్యాలని కోరారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని భవనాన్ని కూల్చివేయాలని కోర్టును కోరారు. అయితే ఈ పిల్ వేయడంలో మీకున్న ఆసక్తి ఏమిటని ఎమ్మెల్యే ఆర్కేను ప్రశ్నించిన కోర్టు.. చివరికి ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

Tags

Next Story