ఇంగ్లీషులో మాట్లాడి అధికారులను హడలెత్తించిన కూరగాయల వ్యాపారి..

ఇంగ్లీషులో మాట్లాడి అధికారులను హడలెత్తించిన కూరగాయల వ్యాపారి..
X

చదువుకున్న వాళ్లు కూడా ఇంగ్లీషులో మాట్లాడాలంటే తడబడతారు. అలాంటిది ఆపకుండా అనర్గళంగా మాట్లాడేస్తుంది.. ఏం చదివుంటుందో తెలుసుకుందామని ప్రయత్నించి అవాక్కయ్యారు అక్కడి వారు. ఇండోర్ లోని మునిసిపల్ అధికారులపై నిరసన తెలుపుతూ ఓ మహిళా కూరగాయల అమ్మకందారు ఇంగ్లీషులో మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇండోర్ లోని దేవి అహల్యా విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్‌లో పీహెచ్‌డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) చేశానని రైసా అన్సారీ పేర్కొంది. మున్సిపల్ అధికారులు ఆమె కూరగాయల బండిని అడ్డుకున్నారు. దీంతో ఆమె వారితో వాగ్యుద్ధానికి దిగింది. ఇంగ్లీషులో అధికారులను కడిగి పారేసింది. ఓ వైపు మార్కెట్ మూతపడింది. రెండో మార్కెట్ ను కరోనా దృష్ట్యా అధికారులే మూసేశారు. కొనేవాళ్లు కూడా కరువయ్యారు. ఇంక మేం ఎలా బతకాలి. రోడ్డు మీద బండి కూడా తిప్పుకోనివ్వకపోతే ఎలా.. మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. 20 మందికి పైగా ఉన్న మా కుటుంబసభ్యులకు ఇదే ఆధారం. మేమంతా ఎలా బతకాలి. బండి దగ్గర జనం కూడా లేరు. అయినా సరే మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారు అంటూ రైసా ఆంగ్లంలో అధికారుల మీద ప్రశ్నల వర్షం కురిపించింది.. దీంతో అధికారులు బిత్తరపోయి అంత చదువుకుని ఎందుకు ఈ వ్యాపారం చేస్తున్నావు అని అడిగారు.

పొట్టకూటి కోసం.. ప్రైవేట్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.. గవర్నమెంట్ ఉద్యోగం అంత తేలిగ్గా రాదు. దాంతో ఒకరిదగ్గర చేయిచాచకుండా ఏ వ్యాపారం చేసుకుంటేనేమి.. అందుకే నేను కూరగాయలు అమ్ముకుని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని తెలిపింది. ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ చదువురాని వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారు.. విద్యావంతులు ఇలా రోడ్డు మీద పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్నారు అని ట్వీట్ చేశారు.

Tags

Next Story