కేటీఆర్ కి ప్రకాష్ రాజ్ స్పెషల్ విషెస్

కేటీఆర్ కి ప్రకాష్ రాజ్ స్పెషల్ విషెస్
X

ప్రజలకు అన్ని వేళలా అండగా నిలబడే వాడే నిజమైన నాయకుడు అని నటుడు ప్రకాష్ రాజ్ కేటీఆర్ ని ఉద్దేశించి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. నటుడు ప్రకాష్ రాజ్ .. డియర్ ఫ్రెండ్ కేటీఆర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మరింత ఆరోగ్యంగా, ధృఢంగా ఉండాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కేటీఆర్ కు సంబంధించిన ఓ ప్రత్యేకమైన వీడియోను ఈ సందర్భంగా జత చేశారు.

Tags

Next Story