నేపాల్‌లో వ‌ర‌ద‌ బీభ‌త్సం!

నేపాల్‌లో వ‌ర‌ద‌ బీభ‌త్సం!
X

నేపాల్‌లో వ‌ర‌ద‌ బీభ‌త్సం సృష్టిస్తోంది. దేశంలో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. ప‌లుచోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుత‌న్నాయి. ఈ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు కారణంగా దేశ‌వ్యాప్తంగా వివిధ ప్ర‌మాదాల్లో మొత్తం 132 మంది నేపాలీలు ప్రాణాలు కోల్పోయారు. 128 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌రో 53 మంది గ‌ల్లంత‌య్యారు. దీంతో నేపాల్‌ని ప‌లు ప్రాంతాల్లో ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాతున్నాయి. ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి పునరావాస కేంద్రాల్లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు.

Tags

Next Story