తెలంగాణలో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వానలు!

తెలంగాణలో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వానలు!

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఛత్తీ‌స్‌‌గఢ్‌ నుంచి దక్షిణ తమి‌ళ‌నాడు వరకు తెలం‌గాణ, కోస్తా ఆంధ్రా మీదుగా అల్ప‌పీ‌డన ద్రోణి కొన‌సా‌గు‌తుంది. దీని ప్రభా‌వంతో రాష్ట్రంలో నైరుతి రుతు‌ప‌వ‌నాలు చురుగ్గా కదు‌లు‌తు‌న్నట్లు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. దీంతో శుక్ర, శని వారాల్లో రాష్ట్ర‌వ్యా‌ప్తంగా పలు చోట్ల ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వర్షాలు కురు‌స్తా‌యని వాతావరణ కేంద్రవ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అక్క‌డ‌క్కడ భారీ వానలు పడే అవ‌కాశం ఉన్న‌ద‌ని వెల్ల‌డించింది.

Tags

Read MoreRead Less
Next Story