'శాక్రిఫైజ్ స్టార్' సునిశిత్ అరెస్ట్

శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో హీరోయిన్లపై హద్దుమీరి మాట్లాడటమే కాకుండా అసభ్య పదజాలంతో వారిని సోషల్ మీడియా వేదికగా దూషించడంతో పలువురు ఇబ్రహీంపట్నం, కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సునిశిత్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా గతంలో కూడా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో తనకు పెళ్లైందని.. ఆమె తనతో ఆరునెలలపాటు కాపురం చేసి.. తరువాత మోసం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు..
దాంతో అతనిపై కేసు ఫైల్ చేశారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో.. మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాలు మొదట తనకే వచ్చాయని.. కానీ హీరోలు నిర్మాతలమీద ఒత్తిడి చేయడంతో డైరెక్టర్లు మోసం చేశారని ఆరోపించాడు. అంతేకాదు జబర్దస్త్ యాంకర్ గాను చేశానని.. అలాగే బాహుబలి సినిమాలో పాట కూడా పాడానని పలు యూట్యూబ్ ఛానళ్లలో చెప్పిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com