ఆగస్టు చివరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ : ఎస్‌ఐఐ

భారత దేశానికీ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) శుభవార్త అందించింది. ఆగస్టు చివరినాకికి కరోనా వ్యాక్సిన్ తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా టీకా తుదిదశ పరీక్షల్లో ఉందని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ను మూడు మిలియన్ల మోతాదులో తయారు చేసే యోచనలో ఉన్నట్టు సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తెలిపింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కు భారతదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా భాగస్వామిగా ఉంది.
ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లను తయారుచేసే సామర్ధ్యం ఉన్న సంస్థగా సీరం ఇన్స్టిట్యూట్ కు పేరుంది. ఇక భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 740 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య 12,87,945కు చేరుకోగా.. మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 30,601 చేరుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com