చివరి ఏడాది పరీక్ష నిర్వాహణపై సుప్రీంకోర్టు విచారణ

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని పలువురు సుప్రీం కోర్టు తలుపుతట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఫైలన్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సర్క్యూలర్ జారీ చేసింది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ.. పలువురు విద్యార్థులు సుప్రీం దర్మాసనాన్ని ఆశ్రయించారు. అయితే, దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు రానున్న రోజుల్లో దీనిపై విచారణకు అంగీకరించింది.
జూలై6న యూజీసీ ఓ సర్క్యులర్ జారీ చేసి.. అన్ని విశ్వవిద్యాలయాలకు చెందిన చివరి ఏడాది పరీక్షలు సెప్టెంబర్ 30నాటికి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అయితే ఈ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 31 మంది విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు. సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్ద చేసి.. ఈ ఏడాది మొత్తం విద్యార్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా మార్కులు వేసారని గుర్తు చేశారు. ఈ విధంగానే యూజీసీ నిర్ణయం ఉంటే ఈ కరోనా సమయంలో బాగుంటుందని పిటిషనర్లు తెలిపారు. ఈ విధంగా ఇచ్చిన మార్కులతో విద్యార్థులు సంతృప్తిగా లేకపోతే.. వారికి తరువా పరీక్షలు నిర్వహించాలని కోరారు.
జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ఈ నెల 18న ఇటువంటి వ్యాజ్యాన్ని తోసిపుచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో జస్టిస్ నాగేశ్వర రావు ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనానికి పంపించింది.
కాగా.. ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై యూజీసీ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ శివసేన నేత ఆదిత్య థాకరే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆదిత్య నేతృత్వంలోని యువ సేన ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com