తుది దశకు చేరుకున్న వివిధ దేశాల వ్యాక్సిన్లు..

ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనాను అంతమొందించేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు. దాదాపుగా 160 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో నాలుగు వ్యాక్సిన్లు చాలా అడ్వాన్స్ లో ఉన్నాయి. తుది ట్రయల్స్ పూర్తి చేస్తున్నాయి. బ్రిటన్, అమెరికా, రష్యా, చైనా సహా భారత్ లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ వైరాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రయోగాల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎక్కువ మందిపై సానుకూల ఫలితాలతో పనిచేయడం శుభ పరిణామమని అంటున్నారు. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్ పూర్తి చేసుకుని ముందు వరుసలో నిలబడింది. చైనా కూడా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసినట్లు, ఇప్పటికే దానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. చైనా మిలటరీ వాళ్లకు ఇవ్వాలని అప్రూవ్ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. వివిధ దేశాలు వ్యాక్సిన్ ని పరస్పర సహకారంతో అభివృద్ధి చేయడం గొప్ప విషయమని వైరాలజిస్టులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com