'బిచ్చగాడు-2' సినిమా పోస్టర్‌ విడుదల

బిచ్చగాడు-2 సినిమా పోస్టర్‌ విడుదల

గతంలో 'బిచ్చగాడు'తో భారీ హిట్ కొట్టిన విజ‌య్ ఆంటోనీ.. తన పుట్టినరోజు సందర్భంగా బిచ్చగాడు-2 యొక్క ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్. మొదటి సినిమాలో బిలియనీర్ నుంచి బిచ్చమెత్తుకునే పాత్రలో కనిపించిన విజయ్.. ఈసారి ఎలా కనిపిస్తాడోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా విజయ్ ఆంటోనియే నిర్మాత‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకి తెలుగులో 'బిచ్చగాడు-2'గా, తమిళంలో ‘పిచ్చైకారన్-2’గా పేరు పెట్టారు. ప్రియా కృష్ణ‌స్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను 2021లో విడుద‌ల చేస్తారు. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బిచ్చగాడు' సినిమా ఎటుంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story