బండి చక్రాల్లో చున్నీ ఇరుక్కుని నిండు గర్భిణి..

బండి ఎక్కేటప్పుడు చున్నీని దగ్గరపెట్టుకునే కూర్చుంటారు. తరువాత మర్చిపోతారు. దాంతో అది బండి చక్రాల్లో చుట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. తాజాగా ఏడు నెలల గర్భిణి ఇదే రీతిన ప్రాణాలు పొగొట్టుకుంది. ఒంగోలు సంతనూతలపాడు గ్రామానికి చెందిన చాట్రగడ్డ సుమకు గత ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది నెలలకే గర్భం దాల్చడంతో కుటుంబం ఆనందించింది. ప్రస్తుతం ఏడో నెల కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఒంగోలు వెళుతోంది. రెడ్డిపాలెం సమీపంలో చున్నీ బండి చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయింది. దాంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆటోలో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె అపస్మారకస్థితికి చేరుకోవడంతో ఒంగోలు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ ఆస్పత్రిలో సుమను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com