క్వారంటైన్‌పై కీలక నిర్ణయం తీసుకున్న అసోం ప్రభుత్వం

కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉంటే సరిపోతుందని అసోం ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలనే నిబందనను సవరించి వారం రోజులకు తగ్గించింది. డిశ్చార్జ్ అయినవారికి అసోం ప్రభుత్వం రెండు వేల రూపాయల విలువైన అత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయతే, ఇకపై ఈ వస్తువుల పంపిణీ నిలివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన కూడా జారీ చేసింది. దారిద్ర్యరేఖకు దిగువను ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. వృద్ధులకు, వికలాంగులకు, దీర్ఘరోగ వ్యాధిగ్రస్తులకూ ఈ సౌలభ్యాన్ని వర్తింపజేసేందుకు డిప్యుటీ కమిషనర్‌కు అధికారాలు ఇస్తున్నట్టు అసోం ప్రభుత్వం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com