బాబ్రీ మసీదు కేసులో అద్వానీ వాంగ్మూలాన్ని నమోదు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాగంగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ వాంగ్మూలాన్ని సీబీఐ స్పెషల్ కోర్టు నమోదు చేసింది. ఈ కేసు విచారణ ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. దీంతో విచారణ వేగవంతం చేస్తున్న లక్నోలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న 32మంది వాంగ్మూలాన్ని నమోదు చేస్తుంది. రోజుకు ఒకరిని పిలిచి వారి వాంగ్మూలాన్ని తీసుకుంటుంది. ఇందులో భాగంగానే శుక్రవారం అద్వానీ వాంగ్మూలాన్ని సీబీఐ స్పెషల్ కోర్టు నమోదు చేసింది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. గురువారం బీజేపీ మరో సీనియర్ నాయకుడు మురళీమనోహర్‌జోషి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ స్పెషల్ కోర్టు తీసుకున్నది. ఈ సందర్భంగా తాను నిర్దోషినని, ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన విషయంలో కుట్రపూరితంగా కేసులు పెట్టిందని అన్నారు. ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్నావారంతా దొంగ సాక్ష్యులని ఆయన మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com