సారీ అన్నా.. పొరపాటు జరిగింది: బండ్ల గణేష్

సారీ అన్నా.. పొరపాటు జరిగింది: బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని నిర్మాత బండ్ల గణేష్.. ఆయనతో పలు హిట్ చిత్రాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన పవర్ స్టార్ సినిమా ట్రైలర్ వైరల్ గా మారింది. రికార్డు స్థాయిలో వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన బ్రదర్స్ వీడియోకు బండ్ల గణేష్ లైక్ కొట్టడంతో పవన్ అభిమానులు షాకయ్యారు. దీని గురించి ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా బండ్ల గణేష్ ను ప్రశ్నించారు. బండ్లన్నా ఈ వీడియోను ఎందుకు లైక్ చేశారు అని అడిగాడు.. దానికి స్పందించిన బండ్ల.. సారీ అన్నా.. ఏదో పొరపాటున జరిగి ఉంటుంది తప్ప కావాలని ఇలా చేయలేదు.. ఒట్టు అని బండ్ల గణేష్.. పవన్ అభిమానికి రిప్లై ఇచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story