రూ.39 కే కరోనా ట్యాబ్లెట్

కరోనా ట్రీట్‌మెంట్‌లో వాడే ట్యాబ్లెట్ ధరలు వరుసగా దిగివస్తున్నాయి. దేశీయ జెనెరిక్ మందు తయారీతో ఈ ట్యాబ్లెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా, రూ.39కే కరోనా ట్యాబ్లెట్ అందజేస్తామని జెన్‌బర్క్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తెలిపింది. ఈ ట్యాబ్లెట్‌ను 'ఫావివెంట్' పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు వెల్లడించింది. ఒక్కో ట్యాబ్లెట్ 200 మిల్లీగ్రాముల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ చైర్మన్ ఆశిశ్ యూ భూటా తెలిపారు. ఒక్కో స్ట్రిప్‌లో 10 ట్యాబ్లెట్లు వస్తాయని తెలిపారు.
ఫావిపిరవిర్ మందుల తయారీకి సిప్లా ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. దీంతో 'సిప్లెంజా' పేరుతో ట్యాబ్లెట్‌ను విడుదల చేయనున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. రూ.68 కి ఒక ట్యాబ్లెట్‌ను అందజేయనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం గ్లెన్‌మార్క్‌కు చెందిన 'ఫాబిఫ్లూ' రూ.75కు ఒక ట్యాబ్లెట్ చొప్పున అందుబాటులో ఉంది. మహారాష్ట్రకు చెందిన బ్రింటన్ ఫార్మా ‘ఫావిటన్' పేరుతో రూ.59కే అందిస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా 'ఫావికొవిడ్-200' పేరుతో త్వరలో ట్యాబ్లెట్లను విక్రయించనున్నట్టు తెలిపింది. బయోఫోర్ సంస్థ కూడా త్వరలో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను విడుదల చేయనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com