తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,640 కరోనా కేసులు
X

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 683 ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,466కి చేరంది. అలాగే కొత్తగా 1,007 మంది కోలుకోవడంతో డిశ్చార్జి అయ్యారని.. ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 40,334గా నమోదైందని వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కొత్తగా కరోనాతో 8 మంది మృతిచెందడంతో.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 455కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 11,677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags

Next Story