సీఎం యడియూరప్పకు కోర్టు సమన్లు

సీఎం యడియూరప్పకు కోర్టు సమన్లు
X

కర్నాటక సీఎం యడియూరప్పకు గోకక్‌లోని జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో యడియూరప్ప ఓట్లు ఏకీకృతం చేయడానికి ప్రయత్నించారని ప్రత్యర్థులు ఆరోపించారు. దీంతో గోకక్‌లోని జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు సమన్లను జారీ చేసింది. గోకక్ పట్టణంలోని వాల్మీకి స్టేడియంలో ఉపఎన్నికల సమయంలో ప్రసంగించిన యడియూరప్ప వీరశైవ లింగాయతుల ఓట్లు ఏమాత్రం చీలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. దీంతో ప్రత్యర్థులు విమర్శల దాడి చేశారు. ఈ నేపథ్యంలో గోకక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది.

Tags

Next Story