ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం
X

జ‌మ్ముక‌శ్మీర్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శ్రీన‌గ‌ర్ శివార్ల‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తాద‌ళాల మ‌ధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇందులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తమ‌య్యారు. కశ్మీర్‌లో జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 143 మంది ఉగ్ర‌వాదులను భ‌ద్ర‌తాద‌ళాలు ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్టాయి.

శ్రీన‌గ‌ర్ శివార్ల‌లోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్ ప్రాంతంలో ఇద్ద‌రు నుంచి ముగ్గురు ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారంతో భ‌ద్ర‌త ద‌ళాలు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు, జ‌మ్ముక‌శ్మీర్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా శ‌నివారం తెల్ల‌వారుజామున గాలింపు చేప‌ట్టాయి.

Tags

Next Story