ఆగస్ట్ లో సినిమా..

ఆగస్ట్ లో సినిమా..
X

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లను ఆగస్ట్ నెలలో తిరిగి ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆగస్ట్లులో సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈవిషయంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని అమిత్ చెప్పారు. ఆగస్ట్ 1వ తేదీ లేదా ఆగస్ట్ 31వ తేదీన దేశంలోని అన్ని నగరాల్లోని సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించాలని తాము సిఫారసు చేసినట్లు కేంద్ర కార్యదర్శి వెల్లడించారు. థియేటర్లలో సామాజిక దూరం పాటించేలా సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించాలని తాము సూచించామని అన్నారు.

Tags

Next Story