ఐఫోన్ 11 మేడిన్ ఇండియా..  చైనా కాదు.. 

ఐఫోన్ 11 మేడిన్ ఇండియా..  చైనా కాదు.. 
X

ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో తొలివిజయం. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ యాపిల్ తన హైఎండ్ మొబైల్ ఐఫోన్ 11ను ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. చెన్నైలోని ఫాక్స్ కాన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి యాపిల్ ఫోన్ మేడిన్ చైనా కాదు.. మేడిన్ ఇండియాగానే కనిపించనుంది. ట్విట్టర్ ద్వారా కామర్స్ మినిస్టర్ పియూష్ గోయల్ ఈ విషయాన్ని చెప్పారు.

అయితే 2019లో ఐఫోన్ XR, 2017లో ఐఫోన్ SE బెంగళూరు ప్లాంట్ లో అసెంబుల్డ్ చేసి విక్రయించింది కంపెనీ. కానీ హైఎండ్ ఫోన్ల విషయంలో మాత్రం చైనా నుంచే వచ్చేవి. ఇప్పుడు వాటిని కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మేకిన్ ఇండియాకు బూస్ట్ ఇస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఐఫోన్ SE 2020 కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

అటు యాపిల్ సంస్థకు విడిభాగాలు సరఫరా చేసే పాక్స్ కాన్ సంస్థ కూడా భారత్ లో 1బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఇండియాలో తమ యూనిట్ సామర్థ్యం పెంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మొత్తానికి అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీయే కాదు.. అది వస్తే దానితో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఇక్కడకే వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే మోదీ తీసుకున్న ఆత్మ నిర్బర్ భారత్ నినాదం భాగానే పనిచేస్తోంది. మేకిన్ ఇండియా ఫర్ వరల్డ్ సాకారం అవుతోంది. అటు చైనాకు తగిన గుణపాఠం చెబుతోంది.

Tags

Next Story