లాక్‌డౌన్‌తో కిక్‌ ఎందుకు తగ్గిందంటే?

లాక్‌డౌన్‌తో కిక్‌ ఎందుకు తగ్గిందంటే?
X

జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో లిక్కర్‌ కంపెనీ జీఎం బ్రేవరీస్‌ నికరలాభం 85 శాతం క్షీణతతో రూ.2.4 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 77శాతం క్షీణతతో రూ.96.8 కోట్లుగా ఉంది. ఎబిటా 81శాతం క్షీణించి రూ.4.9 కోట్లకు పరిమితమైంది. ఎబిటా మార్జిన్‌ 6శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. జూన్‌ త్రైమాసికంలో 1.39 కోట్ల బల్క్‌ లీటర్లు లేదా 15.83 లక్షల బాక్సులకు కంపెనీ అమ్మకాలు పడిపోయాయి. దీంతో కంపెనీ లాభాలు, ఎబిటా కూడా భారీగా క్షీణించింది.

ఇప్పటికీ ముంబై, థానే, సోలాపూర్‌ తో పాటు ఇతర ప్రధాన మార్కెట్లలో లిక్కర్‌ సేల్స్‌కు ఇప్పటికీ ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎం బ్రేవరీస్‌ అమ్మకాలు భారీగా తగ్గాయి. ముఖ్యమైన మార్కెట్లలో అమ్మకాలు 80-85శాతం గా ఉన్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో మధ్యంపై ఆంక్షలు ఉండటం తమ లాభాలపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది.

Tags

Next Story