కర్నూల్‌లో విజయవంతమైన ప్లాస్మా థెరపీ

కర్నూల్‌లో విజయవంతమైన ప్లాస్మా థెరపీ
X

కరోనా మెడిసిన్ ఇంకా అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఈ మమ్మారికి అందుబాటులో ఉన్న పలు మందులు వాడుతూ చికిత్స అందిస్తున్నారు. అయితే, భారత్ లో ప్లాస్మా థెరపీ ద్వారా ఎక్కువగా చేయడంతో రికివరీ రేటు ఎక్కువగా ఉంది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిపిన ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులకి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఐదుగురికి ప్లాస్మా థెరపీ చేయగా.. నలుగురు రీకవరీ అయ్యారని తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారంతా.. ప్లాస్మా దానం చేయాలని.. ప్లాస్మా దానం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని.. ఎలాంటి నష్టం ఉండదని అన్నారు.

Tags

Next Story