అంతర్జాతీయం

నాలుగు కీలక ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్.. మందులు ఇక చవకే..

నాలుగు కీలక ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్.. మందులు ఇక చవకే..
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాలుగు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇందులో ఔషధాల ధరను తగ్గించడానికి , చికిత్స ఖర్చును సరసమైనదిగా మార్చేలా ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో కెనడా నుండి చౌకైగా ఔషధాలు కొనుగోలు చేసేందుకు ట్రంప్ నిర్ణయం వీలుపడుతుంది. చాలా యుఎస్ రాష్ట్రాలకు ఈ ఉత్తర్వులు సహాయపడతాయి.

అలాగే ట్రంప్ కొత్త ఆదేశాలతో ఇన్సులిన్ వంటి మందులు రోగులకు తక్కువ ధరకు లభిస్తాయి. ఔషధాలకు సంబంధించిన ఈ కొత్త ఆర్డర్లు శనివారం నుండి అమల్లోకి వచ్చాయి. మరోవైపు ఈ ఉత్తర్వులపై లోటుపాట్లపై చర్చించడానికి ట్రంప్ జూలై 28 న ఔషధ కంపెనీల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

Next Story

RELATED STORIES