ఏబీవీపీ జాతీయాధ్యక్షుడిపై మహిళ ఫిర్యాదు

పార్కింగ్‌ స్థలం వివాదం, అలాగే తనను వేధించాడనే ఆరోపణలతో చెన్నైలో 62 ఏళ్ల మహిళ ఎబివిపి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య షణ్ముగంపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో, సుబ్బయ్య షణ్ముగం మూత్ర విసర్జన చేసి, వాడిన ముసుగులను తన ఇంటి వద్ద విసిరాడని ఆ మహిళ ఆరోపించింది.

ఆ మహిళ తన ఫిర్యాదులో, సిసిటివి ఫుటేజ్ తోపాటు కొన్ని ఫోటోలను జత చేశారు, అందులో సుబ్బయ్య షణ్ముగం తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తున్నట్లు ఉంది. సదరు మహిళ జూలై 11 న ఆడంబక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై డీఎంకే నాయకురాలు కనిమొళి ట్విటర్‌లో స్పందించారు. మితవాద నాయకుల మీద ఫిర్యాదులు వస్తే.. పోలీసులు గుడ్డివాళ్లలాగా ప్రవర్తించడం రివాజుగా మారిందని ఆరోపించారు.

Tags

Next Story