గన్నవరంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణి..

గన్నవరంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణి..
X

ఏపీలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. లబ్దిదారులైతే పట్టాలు పంపిణి చేసే రోజు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ కృష్ణా జిల్లా గన్నవరంలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇళ్లపట్టాలు అంటేనే లబ్ధిదారులు ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే గన్నవరం నకిలీ ఇళ్లపట్టాల పంపిణీకి కేర్ అఫ్ అయింది. ప్రభుత్వాధికారులు సంతకాలు, వారి స్టాంపులను సైతం ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్లపట్టాలు పంపిణి చేయడం గన్నవరంలో చాలా సహజమైన పరిణామం. గన్నవరం నియోజకావర్గంలో ఓట్లకోసం నకిలీ ఇళ్ల పట్టాలు పంచడం తెరపైకి తెచ్చారు.

నకిలీ పట్టాలు అంటే అదేదో ఆషామాషీగా పట్టాలు అనుకుంటే తప్పులో కాలేసినట్టే నకిలీ పట్టాలు ఒరిజినల్ పట్టాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఆ పట్టాలపై సంబంధిత అధికారి సీల్ వేసి మరి ఇస్తారు. 2019 కి ముందు గన్నవరం నియోజకవర్గంలో ఇళ్లపట్టాల పంపిణి జరిగింది. ఆ సందర్బంగా సుమారు 12 వేల మందికి ఇళ్లపట్టాలు పంపిణి చేశారనే ప్రచారం సాగుతోంది. ఇలా పంపిణి చేసిన పట్టాలని tv5 చేతికి చిక్కాయి. ఆ నకిలీ పట్టాల గుట్టు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి..

Tags

Next Story