అమెరికాలో కరోనా కలకలం

X
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో గత 12 రోజులుగా 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు వెయ్యి మందికిపైగా మరణిస్తున్నారు.
తాజాగా గడిచిన 24 గంటల్లో 68,212 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 41,74,437కు చేరింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 1067 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,46,391కి చేరింది. దేశంలోని కాలిఫోర్నియా, టెక్సాస్, అలబామా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
