ఒక్కరోజే 4.20 లక్షల కరోనా టెస్టులు

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా మమమ్మారి బారిన పడిన వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కొత్తగా 48,916 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి పెరిగింది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 8,49,431 డిశ్చార్జి అయ్యారు. ఇంకా 4,56,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31,358కి పెరిగింది. కరోనా కట్టడిలో కొవిడ్ పరీక్షల నిర్వహణ, కరోనా రోగుల క్వారంటైన్ కీలకమైన నేపథ్యంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి శనివారం ఉదయానికి 24 గంటల్లోనే 4,20,898 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో కేవలం ఒకే ఒక్క కరోనా పరీక్షా కేంద్రం ఉన్నదని, ప్రసుత్తం టెస్టింగ్ కేంద్రాల సంఖ్య 1,301కి పెరిగిందని పేర్కొంది. ఇండియాలో ఇప్పటి వరకు 1,58,49,068 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కొవిడ్ మరణాల రేటు శుక్రవారం 2.35 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 63.54కు పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com