కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతి కోరిన సీరమ్

బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్షిటీ, ఆస్ట్రాజెనికా కలిసి డెవలప్ చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఇండియాలో రెండో దశ క్లీనికల్ ట్రయల్స్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే యూకే సంస్థలతో ఒప్పందం చేసుకున్న పూనేకు చెందిన సీరమ్ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను(DCGI) అనుమతి కోరినట్టు తెలుస్తోంది. తొలిదశ ట్రయల్స్ సక్సస్ ఫుల్ గా చేసిన ఆక్స్ ఫర్డ్ సంస్థ రెండో ఫేజ్ లో వివిధ దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తోంది. అక్టోబర్ నాటిక వ్యాక్సిన్ రెడీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి సంస్థలు. ఫస్ట్ ఫేజ్ లో వ్యాక్సిన్ ఎఫెక్టీవ్ గా పనిచేసినట్టు ఇటీవల జర్నల్ ప్రచురించింది. త్వరలోనే రెండో ఫేజ్ కూడా కంప్లీట్ చేసి.. మూడో దశ ట్రయల్స్ కు వెళతామని కంపెనీ చెబుతోంది. వాస్తవానికి సెకండ్ అండ్ థర్ఘ్ ఫేజ్ సైమంటేనియస్ గా జరపాలని కంపెనీ భావిస్తోంది. సీరమ్ చేసిన ధరఖాస్తులో 1600 మంది వాలంటీర్లు ఉన్నట్టు తెలిపింది. అంతా 18 ఏళ్ల పైబడినవారేనని.. వారికి అన్ని పరీక్షల చేసిన తర్వాతే ట్రయల్స్ మొదలుపెడతామంటోంది కంపెనీ. ఆక్సఫర్డ్ ఆస్ట్రాజెనికా సంస్థలతో సీరమ్ వంద కోట్ల డోస్‌ల ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంది. ఇండియాలో ఈ కంపెనీనే మార్కెట్ చేయనుందని సంస్థ CEO అదర్ పూనావాలా ఇప్పటికే స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com