సైనికుల శౌర్యం తరతరాలకు స్పూర్తిదాయకం: ప్రధాని మోదీ

కార్గిల్ దివాస్ సందర్భంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైనికుల దైర్యసాహసాలను కొనియాడారు. దేశాన్ని రక్షించిన సాయుధ బలగాల ధైర్యం, సాహసాలు మరువలేనివని ట్వీటర్ వేదికగా గుర్తుచేసుకున్నారు. కార్గిల్ వార్ లో సైనికులు చూపించిన దైర్యం తరతరాలకు స్పూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు. అమిత్ షా కూడా దేశ సైనికుల శౌర్యాన్ని స్మరించుకున్నారు. సరిహద్దుల్లో ఉంటూ.. దేశాన్ని కాపాడే సైనికులే నిజమైన హీరోలని ప్రశంసించారు. కార్గిల్‌వార్‌లో విజయం సాధించడానికి ప్రధాన కారణం జవాన్ల శౌర్య, ప్రరాక్రమాలేనని అమిత్‌ షా ట్విట్టర్‌లో తెలిపారు.

Tags

Next Story