గుడ్ న్యూస్.. పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

గుడ్ న్యూస్.. పాలిసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

విద్యార్థులకు శుభవార్త. పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ‌హించ‌నున్న కామ‌న్ ఎంట్రెన్స్‌ టెస్ట్- 2020 గ‌డువును పెంచింది టీఎస్ ఎస్‌బీటీఈటీ. పాలిసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్‌ శనివారం ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 25తో దరఖాస్తుల గడువు ముగియడంతో రూ.300 ఆలస్య రుసుంతో 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే డిప్లోమా కోర్సుల్లో 2020-21 విద్యా సంవ‌త్స‌రం పాలిసెట్‌లో వ‌చ్చిన ర్యాంకుల ఆధారంగా మాత్ర‌మే అడ్మిష‌న్లు జ‌రుపుతామ‌ని విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story