బ్యాంకులను ఉద్దేశించి ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు

బ్యాంకులను ఉద్దేశించి ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబులిటీ రిపోర్టులో బ్యాంకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది RBI. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి 620 బేసిస్ పాయింట్లు అంటే మొత్తం బ్యాంకుల అసెట్ లో 14.7శాతానికి బ్యాడ్ లోన్స్ NPAలు పెరగొచ్చని అంచనా వేసింది. గ్రాస్ నాన్ పెర్మార్మెన్స్ అసెట్ రేషియో మార్చి 2020 నాటికి 8.5శాతంగా ఉంది. ఇది మార్చి 2021 అంటే ఈ ఆర్ధిక ఏడాది అంతానికి 12.5శాతానికి చేరుతుందని..మాక్రో ఎకనామిక్ వాతావరణం మరింత దారుణంగా ఉంటే.. ఇది14.5శాతానికి కూడా పెరుగుతుందని హెచ్చరించింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటికే 4నుంచి 5శాతం వరకూ బ్యాడ్ లోన్స్ ఉంటాయని అంచనా వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మార్చి 2020 నాటికి 11.3శాతం కాగా.. ఇది మార్చి 2021 నాటికి 15.2శాతానికి పెరుగుతుందని RBI చెబుతోంది. ప్రైవేటుబ్యాంకుల్లో 4.2 శాతం నుంచి 7.3శాతంగా ఉంటుందని అంచనా. 5 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్నవారి నుంచి బ్యాడ్ లోన్స్ 51.3శాతం ఉన్నాయి. మరి బ్యాంకులు కష్టాన్ని తట్టుకుంటాయా? ఏది ఏమైనా బ్యాంకింగ్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఆచితూచి పెట్టాలంటున్నాయి మార్కెట్ వర్గాలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com