తిరుపతిలో మద్యం షాపుల దగ్గర నయా దందా..

తిరుపతిలో మద్యం షాపుల దగ్గర నయా దందా..
X

తిరుపతిలో మద్యం షాపుల దగ్గర కొత్త దందా మొదలయింది. దుకాణాల దగ్గర మందుబాబులు భౌతికదూరం పాటించేందుకు గాను అధికారులు గొడుగుల నిబంధన విధించారు. గొడుగు లేనివారికి మద్యం కూడా అమ్మడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వైన్ షాపుల దగ్గర సరికొత్త వ్యాపారం ప్రారంభించారు. ఐదునిమిషాలకోసం గొడుగు అద్దెకు ఇచ్చి ముప్పై రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఇలా కొంతమంది వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి వాడిన గొడుగును మరొక వ్యక్తి వాడితే ప్రమాదం అనే విషయాన్నీ మరచి మందుబాబులు ఇలాగే చేస్తున్నారు.

Tags

Next Story