ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకీల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మల్కాస్‌గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. 10 రోజుల వ్యవధిలో ఏవోబీలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీస్ బలగాలు అడవిలో కూంబింగ్ చేపట్టాయి.
అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. అయితే ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు.. దాంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదిలావుంటే రెండు రోజుల కిందట విశాఖ జిల్లా అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ హత్యలతో సంబంధం ఉన్న మావోయిస్టు రణదేవ్ బుధవారం ఒడిశాలోని మల్కాన్‌గిరి ఎస్పీ రిషికేశ్ డికిళారి ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com