ఏవియేషన్ రంగానికి ఊరట!

ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక సంస్థలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇటీవల కాలంలో ఫేస్ బుక్, అమోజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు 17 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇంకా చాలా కంపెనీలు క్యూకడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు తొలగించి బిజినెస్ టు బిజినెస్ ట్రావెల్స్ అనుమతించాలని భావిస్తోంది ప్రభుత్వం. జపాన్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు విమానయాన సర్వీసులు పురుద్దరించేందుకు సిద్దమవుతోంది. టెక్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈ కామర్స్ రంగంలో ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణ ఆంక్షలు ఉండటం మంచిది కాదని నమ్ముతున్నారు.
గడిచిన మూడు నెలలుగా అమెరికా సహా అగ్రదేశాలకూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న చైనా నుంచి కంపెనీలు క్రమంగా తరలిపోతున్నాయి. వాటిని ఇండియాకు రప్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పలుకంపెనీలు ఇప్పటికే అంగీకరించాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మేడిన్ ఇండియా ఫర్ వరల్డ్ అంటూ దేశీయ ఉత్పత్తిరంగాన్ని పరుగులు పెట్టించాలని మోదీ పట్టుదలతో ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం FDI నిబంధనలు మార్చడంతో పాటు... ఏవియేషన్ ఆంక్షలు ఎత్తేయనున్నారు. తాజా నిర్ణయంతో ఏవియేషన్ రంగానికి ఊరటలభిస్తుంది. పెట్టుబడుల వ్యూహం ఫలిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com