నేడు తేలనున్న పైలట్ వర్గ ఎమ్మెల్యేల భవితవ్యం

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ చేస్తున్న పోరాటం కోర్టుకు, రాజ్ భవన్‌కు చేరుకుంది. స్పీకర్ సిపి జోషి.. సచిన్ పైలట్ క్యాంప్ ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులపై హైకోర్టు నిర్ణయం తరువాత, సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. అదే సమయంలో, బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు విచారించనుంది, ఇందులో ఆరుగురు బిఎస్పి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేశారు.
దిలావర్ పిటిషన్‌పై హైకోర్టు జస్టిస్ మహేంద్ర గోయల్ సోమవారం విచారణ జరపనున్నారు. ఇందులో అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీతో సహా బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కూడా పార్టీలుగా చేశారు. అదే సమయంలో, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఈ ఆరుగురు ఎమ్మెల్యేలను రాజస్థాన్ శాసనసభ సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. కానీ, ఫిర్యాదుపై స్పీకర్ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com