తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోన్న డాలర్!

తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోన్న డాలర్!

డాలర్ రోజురోజుకు క్షీణిస్తొంది. అటు కరోనా వైరస్.. ఇటు అమెరికా -చైనా మధ్య వాణాజ్యయుద్ధం కారణంగా డాలర్ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది. జపాన్ యెన్ తో పోల్చితే నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. యూరోతో పోల్చితే 22 నెలల కనిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక యూరో వచ్చి 1.1699 డాలర్లుగా ఉంది. డాలర్ తో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా చాలా కరెన్సీలు లాభపడుతున్నాయి. చైనా టెన్షన్ తో పాటు.. కరోనాతో ఇప్పట్లో అమెరికా కోలుకోవడం కష్టమన్న సంకేతాలున్నాయి. ఎన్నికలు, బెయిల్ అవుట్ ప్యాకేజీల్లో సందిగ్ధత వంటివి ప్రతికూలంగా మారాయి. అటు యురోపియన్ యూనియన్ భారీ బెయిల్ అవుట్ ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యూరో బలపడుతోంది. ఇండియన్ రూపీ కూడా స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ఇది 74.82 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఉన్న సెంటిమెంట్ నేపథ్యంలో తగ్గకపోయినా.. 75 రూపాయల దాటదన్న సంకేతాలున్నాయి. మొత్తానికి డాలర్ తో రూపాయి 74.50-75.50 మధ్య ఉంటుందని అంచనా.

Tags

Read MoreRead Less
Next Story