శ్రీశైలం జలాశయంలోకి కొనసాగుతోన్న వరదప్రవాహం

శ్రీశైలం జలాశయంలోకి కొనసాగుతోన్న వరదప్రవాహం
X

ఎగువ నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు గత 10 రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు నిండిపోవడంతో జూరాలకు వరద కొనసాగుతుంది. ఇటు శ్రీశైలం జలాశయానికి జులై 15 నుంచి ప్రారంభమైన వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 74,720 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 42,378 క్యూసెక్కులుగా ఉంది. దాంతో ప్రస్తుతం సాగర్‌లో నీటి నిల్వ సామర్ధ్యం 186.46 టీఎంసీలు ఉంది.

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 854 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 89.09 టీఎంసీలు అందుబాటులో ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Tags

Next Story