రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు..

రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు..
X

కరోనా కాలంలోనూ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లో రోజుకో రికార్డును నమోదు చేస్తున్నాయి. మున్ముందు ఇంకా పెరగడమే కాని తగ్గే ఛాన్స్ లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1900 డాలర్లకు ఎగబాకింది. వెండి కూడ అదే స్థాయిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఔన్స్ వెండి 23 డాలర్లకు చేరుకుంది. వచ్చే ఏడాది నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు 2,500 డాలర్లకు చేరుకోవచ్చని పుణెకు చెందిన జువెలరీ బ్రాండ్ పీఎన్ గాడ్గిల్ ఎండి, సీఈఓ సౌరభ్ గాడ్గిల్ అన్నారు. భారత్ లో స్వచ్ఛమైన మేలిమి బంగారం 50 వేల దాటింది. హైదరాబాద్ మార్కెట్లో 24 గ్రాముల పసిడి ధర రూ.53,470కి చేరుకుంది. కేజీ వెండి రూ.61,200 పలికింది. వచ్చే 12 నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.65,000, కేజీ వెండి ధర రూ. 74,000 దాటవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకుల అంచనా.

Next Story