ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నేత మస్కు నర్సింహ్మ(52) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఐదు రోజుల క్రితం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Tags

Next Story