అబుదాబిలో భారత దంపతుల అనుమానాస్పద మృతి

అబుదాబిలో భారత దంపతుల అనుమానాస్పద మృతి
X

అబుదాబిలోని ఓ ఫ్లాట్‌లో భారత్‌కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్నీ మీడియా నివేదికలు తెలిపాయి. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్థనన్ పట్టీరీ (57), మినీజా (52) దాదాపు 18 సంవత్సరాలుగా అబుదాబిలో నివసిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన పట్టీరీ ఇటీవల ఉద్యోగం కోల్పోయాడు. మినిజా చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నారు. అయితే వారు ఎలా చనిపోయారని విషయం మాత్రం ఇంకా తేలలేదు.

ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. జనార్థనన్‌, మినిజ చాలా మంచివారని. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదని అన్నారు. జనార్ధనన్‌ తన ఉద్యోగం కోల్పోవడంతో కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags

Next Story